Chiranjeevi: మరోసారి స్టెప్పులతో ఇరగదీసిన మెగాస్టార్‌.. వీడియో చూశారా..!

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022‌: మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆచార్య’. కొరటాలశివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకొంటోంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ‘ఆచార్య’ నుంచి మాస్‌ పార్టీ సాంగ్‌ ప్రోమో విడుదలైంది. ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’ అంటూ సాగే ఈ పాటలో చిరంజీవి గ్రేస్‌ఫుల్‌ స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. ఆయనకు జంటగా రెజీనా సైతం డ్యాన్స్‌తో మెప్పించారు. రేవంత్‌-గీతామాధురి ఆలపించిన ఈ పూర్తి పాటను సోమవారం సాయంత్రం విడుదల చేయనున్నారు. దేవాదాయ శాఖలోని అవినీతి నేపథ్యంలో తెరకెక్కిన ‘ఆచార్య’ కోసం ‘ధర్మస్థలి’ పేరుతో భారీసెట్‌ ఏర్పాటు చేశారు. ఇందులోని కొన్ని సన్నివేశాల్లో మెగాస్టార్‌ నక్సలైట్‌గా కనిపించనున్నారు. అలాగే, రామ్‌చరణ్‌.. సిద్ధగా ఓ కీలక పాత్రలో సందడి చేయనున్నారు. చిరుకు జోడీగా కాజల్‌, చరణ్‌కు జంటగా పూజాహెగ్డే స్క్రీన్‌ షేర్‌ చేసుకోగా సోనూసూద్‌ నెగెటివ్‌ షేడ్‌ రోల్‌లో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడెక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us