అనంతపురం (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022: మల్లికేతి హెచ్ఎల్సీ కాలువ దగ్గర ప్రమాదం జరిగింది. బొలేరో వాహనం కాలువ దాటుతుండగా బ్రిడ్జి కుప్పకూలింది. బొమ్మనహళ్ మండలం ఉద్దేహళ్‌కు చెందిన కూలీలు పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బొలెరో వాహనంలో వెళ్తుండగా కాలవపై రాగానే బ్రిడ్జి కుప్పకూలింది. దీంతో కూలీలు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేశారు. స్థానికుల సహాయంతో కొందరు బయటపడ్డారు. ముగ్గురు కూలీలు నీటిలో కొట్టుకుపోయారు. గల్లంతైన కూలీల ఆచూకీ కోసం వెతుకుతున్నారు.







