UPDATED 8th FEBRUARY 2022 TUESDAY 09:50 PM
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్): భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. దశాబ్దాల తెలంగాణ పోరాటాన్ని, ప్రజల త్యాగాలను మోదీ పదే పదే అవమానిస్తున్నారని ట్విటర్‌లో కేటీఆర్ పేర్కొన్నారు.







