ఆదిత్యలో ఘనంగా ప్రారంభమైన గో- కార్ట్ రేసింగ్ పోటీలు

UPDATED 14th FEBRUARY 2018 WEDNESDAY 9:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో సీజర్ ప్రో కార్టింగ్ ఛాంపియన్ షిప్ -2018 పేరిట నిర్వహిస్తున్న గో- కార్ట్ రేసింగ్ రెండవ సీజన్ పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్, ప్రత్యేక అతిథులుగా సీజర్ ఇన్నోవేషన్ కంపెనీ ప్రెసిడెంట్ డి. అంజన్ ప్రసాద్, ట్రెజరర్ శ్రీకాంత్ రెడ్డి, సీజర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మార్కెటింగ్ మేనేజర్ ఎం. వెంకట సాయికిరణ్ హాజరైనారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ యువ ఇంజనీర్ల సృజనాత్మక శక్తికి, నైపుణ్యానికి, సరికొత్త ఆవిష్కరణలకు తమ క్యాంపస్ వేదిక కావడం ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్ధిలోని పరిజ్ఞానాన్ని ప్రత్యక్షంగా పరీక్షించి మొదటి సీజన్ లో విజయవంతం అయిన తర్వాత అధ్యాపకుల, విద్యార్థుల ఉత్సాహం, ప్రోత్సాహంతో ఈ రెండవ సీజన్ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. దేశ వ్యాప్తంగా 24 కళాశాలల నుంచి 27 టీములకు చెందిన ఏడు వందల మంది విద్యార్థులు పాల్గొంటున్నారని, వీరిని వివిధ రకాలుగా పరీక్షించేందుకు వివిధ కంపెనీలకు చెందిన నిపుణులు 15 మంది న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారన్నారు. ఈ నెల 17 వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో టెక్నికల్ టెస్టులు ఉత్తీర్ణులైన వారికి స్పీడ్, బ్రేక్, లోడింగ్, డిజైన్, మార్కెటింగ్ తదితర అంశాలలో అర్హత సాధించిన వారు ఫైనల్స్ కి అర్హత సాధిస్తారన్నారు. విజేతకు రూ. 70 వేలు, రన్నర్ గా నిలిచిన టీముకు రూ. 30 వేలు, వివిధ కేటగిరీల్లో మొత్తం రూ. 2.70 లక్షలు నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యఅతిధిగా హాజరైన ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో మొదటిసారిగా ఈ పోటీలను గత ఏడాది ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేసిన ఆదిత్య యాజమాన్యం నిర్వహిస్తున్న సీజర్ ప్రో కార్టింగ్ ఛాంపియన్ షిప్-2018 రెండవ సీజన్ పోటీలు మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా ఈ పోటీలకు విచ్చేసిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియచేశారు. అనంతరం బెలూన్లను ఎగురవేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యఅతిధిగా హాజరైన డాక్టర్ శంభూప్రసాద్ ను వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్  డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, తదితరులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us