CM KCR : నూతన సంవత్సరంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి: కేసీఆర్‌

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022‌: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏటా వినూత్న పంథాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ సబ్బండ వర్గాలు ప్రగతి పథాన పురోగమించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం అన్నారు. 2022 నూతన సంవత్సరంలో కూడా కష్టాలను అధిగమిస్తూ అదే అకుంఠిత దీక్షతో సుపరిపాలనను కొనసాగిస్తూ .. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి తెలిపారు. 2022 నూతన సంవత్సరంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us