ఖాళీ స్థలాలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలి

* జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి

UPDATED 5th NOVEMBER 2020 THURSDAY 9:00 PM 

కాకినాడ (రెడ్ బీ న్యూస్); కాకినాడ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ), రంగరాయ వైద్యకళాశాల (ఆర్ఎంసీ)లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను వీలైనంత సమర్ధవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జి. లక్ష్మీశ, ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణలతో కలిసి కలెక్టర్ గురువారం ఐటీఐ, ఆర్ఎంసీలను పరిశీలించారు. తొలుత ఐటీఐ ప్రాంగణంలోని వెల్డర్, మోటార్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ తదితర విభాగాలను నిశితంగా పరిశీలించారు. 15.76 ఎకరాల స్థలంలో ఉన్న నిర్మాణాల గురించి ఐటీఐ అధికారులను అడిగి తెలుసుకుని నిర్మాణాల స్కెచ్ లు పరిశీలించి ఖాళీ స్థలాల వివరాలు గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం 14 కోర్సుల చెందిన విద్యార్థులున్న ఐటీఐని ఎక్కడికీ తరలించకుండానే ఆర్ఎంసీని విస్తరించాల్సిన అవసరముందని అన్నారు. రెండు సంస్థల్లో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాల ద్వారా గరిష్ట ప్రయోజనం చేకూరేలా నివేదికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రాంగణంలో ప్రభుత్వ ఐటీఐతో పాటు జిల్లా ఉపాధి కార్యాలయం, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం, 200 పడకల సామర్థ్యంగల ఎస్టీ వసతిగృహం, 33కేవీఏ సబ్ స్టేషన్ ఉన్నట్లు ఐటీఐ అధికారులు ఆయనకు వివరించారు. ఆరెకరాల విస్తీర్ణంలో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ విభాగాల శిక్షణకు ఉపయోగపడే డ్రైవింగ్ ట్రాక్ ఉందని, అలాగే కోట్ల విలువైన ల్యాబ్ ఎక్విప్ మెంట్ ఉందన్నారు. 1947లో ఏర్పాటైన ఐటీఐ నుంచి ఏటా దాదాపు వెయ్యిమంది విద్యార్థులు శిక్షణ పూర్తి చేసుకున్నారని వివరించారు. అనంతరం కలెక్టర్ రంగరాయ వైద్య కళాశాలలో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను కూడా పరిశీలించి వైద్యకళాశాల విస్తరణకు సంబంధించి బోధన, అనుబంధ ఆసుపత్రి నిర్మాణాలపై అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. బాబ్జీ, ఐటీఐ ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ ఇజి మోహనరావు, సూపరింటెండెంట్ డి. సత్యనారాయణ, జిల్లా ఉపాధి కల్పన అధికారి ఇ. వసంతలక్ష్మి, తదితరులు ఉన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us