Republic day: 25 శకటాలు.. 16 కవాతు విభాగాలు

★ కనువిందు చేయనున్న గణతంత్ర వేడుకలు

UPDATED 23 JANUARY 2022 SUNDAY 12.15 PM

 ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) : ఈ ఏడాది దేశరాజధానిలో జరిగే గణతంత్ర వేడుకల ప్రధాన కార్యక్రమంలో 16 కవాతు విభాగాలు కనువిందు చేయనున్నాయి.. ఇవి రాజ్ పథ్ పై ఠీవిగా, లయబద్ధంగా ముందుకు సాగుతూ వీక్షకులను ఆకట్టుకోనున్నాయి. వీటిలో సైన్యం, నౌకాదళం, వాయు సేన, కేంద్ర పారామిలటరీ దళాలు, ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాలు భాగస్వామ్యం కానున్నాయి. అలాగే 11 సైనిక బ్యాండ్ లు, 25 శకటాలు కనువిందు చేయనున్నాయని భారత సైన్యం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. సైన్యం తరఫున అశ్విక దళం, 14 మెకనైజ్డ్ విభాగాలు, ఆరు మార్చింగ్ కంటింజెంట్లు పాల్గొననున్నాయి. ఆర్మీకి చెందిన ఆరు ధ్రువ్ హెలికాప్టర్లు గగనయానం చేయనున్నాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us