తెలుగు రాష్ట్రాల సీఎస్ లతో హోమ్ శాఖ కార్యదర్శి భేటీ..విభజన అంశాలపై చర్చ

అమరావతి (రెడ్ బీ న్యూస్) 12 జనవరి 2022 : రాష్ట్ర విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్ష ముగిసింది. ఢిల్లీ నుంచి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వర్చువల్ గా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమీర్ శర్మ, సోమేష్ కుమార్‌తో విభజన అంశాల వివాదంపై చర్చించారు. ఏపీ పునర్విభజన చట్టం 9, 10 షెడ్యుళ్ల పరిధిలోని వివిధ సంస్థల విభజనతో పాటు, ఆర్థిక వనరుల పంపకాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అలాగే షీలా బేడి కమిటీ సిఫార్సు చేసిన అంశాలపైనా సమీక్షించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనతో పాటు వివిధ బ్యాంకు డిపాజిట్లు, నగదు నిల్వల పంపకం తదితర అంశాలపై చర్చించారు. ఏపీ జెన్ కోకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన రూ. 6 వేల కోట్ల బకాయిలను చెల్లించేలా చూడాలని ఏపీ అధికారులు కోరారు. మరోవైపు కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు దుగరాజపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణంలో కేంద్రం ఆర్ధిక సహకారం అందించాలని ఏపీ కోరింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us