అందరికి ఇళ్ళు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

UPDATED 19th JUNE 2017 MONDAY 10:00 AM

పెద్దాపురం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అందరికి ఇళ్ళు పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు పేర్కొన్నారు. స్థానిక వాలు తిమ్మాపురం రోడ్ లో ప్రధాన మంత్రి ఆవాస యోజన, ఎన్టీఆర్ నగర్ పథకం కింద నిర్మించనున్న 1724 గృహ నిర్మాణ పనులకు ఆయన సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో గృహ నిర్మాణాల కోసం ప్రజలు ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్నారని వారి కలలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. హోం మంత్రి చినరాజప్ప నియోజక వర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, అందులో భాగంగా అందరికి ఇళ్ళు నిర్మించాలని ఉద్దేశ్యంతో జి ప్లస్ అపార్ట్ మెంట్ లను నిర్మిస్తున్నారని, అన్ని మౌలిక వసతులతో మోడరన్ టెక్నాలజీ ని ఉపయోగించి ఈ గృహ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఆధార్ అనుసంధానం ద్వారా ఇళ్ళు మంజూరైనట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, లలితా ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ మట్టే శ్రీనివాస్, కౌన్సిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.   
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us