పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు

పెద్దాపురం,13 నవంబరు 2020 (రెడ్ బీ న్యూస్) : పశువుల అక్రమ రవాణాను పెద్దాపురం పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అడ్డుకున్నారు. ఎస్సై ఏ.బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం నుంచి సామర్లకోటలో ఉన్న గోవధశాలకు ప్రత్యేక వాహ నాల్లో అక్రమంగా పశువులను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు మండల పరిధిలోని దివిలి గ్రామ జంక్షన్ వద్ద తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టామని దీంతో ఐదు బొలేరో వాహనాల్లో 21 పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. దీంతో వాహనాలతో పాటు, పశువులను పెద్దాపురం పోలీస్ స్టేషనుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. అలాగే పశువులను అక్రమంగా తరలిస్తున్నవారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు గోవులను గోసంరక్షణాశాలకు తరలించినట్లు చెప్పారు. పశువులను తరలిస్తున్న వాహనాలను సీజ్ చేస్తామని చెప్పారు. ఈ విషయంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us