ప్రభుత్వ అభివృద్ధి పనులకు స్వచ్చంద సంస్థల సహకారం అవసరం

UPDATED 5th MAY 2018 SATURDAY 8:30 PM

సామర్లకోట: ప్రభుత్వ అభివృద్ధి పనులకు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు యాజమాన్యాలు తోడైతే ప్రజలకు మరిన్ని అభివృద్ధి పనులు చేరువవుతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక పంచారామ క్షేత్రమైన శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి దేవస్థానంలో సామర్లకోట నవభారత వెంచర్స్ యాజమాన్యం రూ. ఐదు లక్షల ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి సరఫరా ఆర్వో ప్లాంటును మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ప్రైవేటు సంస్థలు, దాతల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు అందిస్తున్నామని, దేవస్థానంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు ద్వారా భక్తులకు స్వచ్చమైన త్రాగునీరు అందించవచ్చని అన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటు చేసిన నవభారత్ వెంచర్స్ యాజమాన్యాన్ని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం సంస్థ వైస్ ప్రెసిడెంట్ నాగభైరవ ప్రభాకర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం. రాఘవయ్యలను మంత్రి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, కుమారారామ భీమేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, సభ్యులు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, కౌన్సిలర్ మన్యం చంద్రరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, దేవస్థానం అర్చకులు సోమేశ్వరశర్మ, సుబ్బన్న, వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us