AP News: తిరుమల ఘాట్‌ రోడ్డులో మరమ్మతు పనులు ప్రారంభం

తిరుమల (రెడ్ బీ న్యూస్) 11 డిసెంబర్ 2021: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుమల ఘాట్‌ రోడ్డులో కొండ చరియలు విరిగిపడి ధ్వంసమైనచోట మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. ఆఫ్కాన్‌ సంస్థకు చెందిన కార్మికులు మరమ్మతు పనులు చేపట్టారు. ఈ పనులను తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. బండ రాళ్లను ఎలా తొలగిస్తున్నారు?కొండ పైనుంచి రాళ్లు కిందికి పడకుండా వాల్‌ కాంక్రీట్‌ ఎలా వేస్తున్నారు? తదితర విషయాలను కార్మికులను ఆయన అడిగి తెలుసుకున్నారు.

వాహనాలు విరాళంగా అందజేసిన టీవీఎస్‌

తితిదేకు టీవీఎస్‌ సంస్థ వాహనాలను విరాళంగా అందజేసింది. రూ.4.5లక్షల విలువైన ఓ ఆటో, రెండు ద్విచక్ర వాహనాలను తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డికి టీవీఎస్‌ సంస్థ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా వాహనాలను ఆయన ప్రారంభించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us