UPDATED 12th DECEMBER 2017 TUESDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో సృజనాత్మకత, ఆవిష్కరణలపై వర్క్ షాప్ నిర్వహించినట్లు డైరెక్టర్ డాక్టర్ ఎన్.సుగుణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్కిల్ నెస్ట్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీరామకృష్ణ హాజరై మాట్లాడారు. విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాలలో సమానంగా రాణించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని, ఆధునిక పద్దతులను, నూతన పోకడలను అనుసరించి నిరంతరం శ్రమిస్తూ లక్ష్యాలను సాధించాలన్నారు. డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ తమ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఎప్పటికప్పుడు వివిధ రంగాల నిష్ణాతులతో వర్క్ షాపులు నిర్వహించడం జరుగుతోందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో సమయపాలన, భావవ్యక్తీకరణ తదితర అంశాలలో విద్యార్థులకు తగు మెళకువలు అందించేందుకు ఇటువంటి వర్క్ షాపులు ఏర్పాటుచేస్తున్నామన్నారు. అనంతరం శ్రీరామకృష్ణను ఆదిత్య యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







