UPDATED 18th OCTOBER 2017 WEDNESDAY 5:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫైనల్ ఇయర్ బిటెక్ ఈఈఈ విద్యార్థి జి.ఎస్.ఎస్.నగేష్ బాబు " మై పవర్ " పేరిట జాతీయస్థాయిలో నిర్వహించిన ఆప్టిట్యూడ్ టెస్ట్ -2017 లో విశేష ప్రతిభ కనబరిచి ప్రథమస్థానంలో నిలిచినట్లు సంస్థ వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామ కృష్ణారావు మాట్లాడుతూ "మై పవర్" పేరిట అఖిలభారతస్థాయిలో నిర్వహించిన ఆన్ లైన్ టెస్ట్ లో 84 వేలమంది విద్యార్థులు పాల్గొనగా 20 మంది ఫైనల్స్ కు అర్హత సాధించారని, అందులో తమ కళాశాలకు చెందిన విద్యార్థి నగేష్ బాబు టాప్ వన్ లో నిలిచి ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నాడన్నారు. యువత సోషల్ మీడియాతో కాలాన్ని వృధా చేసుకోకుండా నగేష్ బాబును ఆదర్శంగా తీసుకుని ఇటువంటి పోటీలలో పాల్గొనడం ద్వారా విద్యార్థులు తమ సృజనాత్మకతకు పెంపొందించుకోవాలన్నారు. విజేతగా నిలిచిన విద్యార్థిని సంస్థ చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి , డైరెక్టర్ ఎం. శ్రీనివాస రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రాయుడు శ్రీనివాస్ తదితరులు అభినందించారు.







