Omicron: ఒమిక్రాన్ పై పొరుకు ప్రత్యేక టీకా..రూపొందిస్తున్న ఫార్మా కంపెనీ

ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అనేక దేశాల్లో వెలుగుచూస్తున్న కొత్త కేసుల్లో ఈ వేరియంట్ వే అధిక శాతం ఉంటున్నాయని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ పై పోరుకు ప్రత్యేకంగా ఓ టీకాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ లోని పుణెకు చెందిన జెన్నోవా బయోఫార్మా కంపెనీ ఒమిక్రాన్ కోసం ప్రత్యేక టీకాను తయారుచేస్తోందని.. నెల, రెండునెలల్లో అది సిద్ధం కానున్నట్లు సమాచారం. అయితే దీన్ని బూస్టర్ లేదా స్వతంత్ర వ్యాక్సిన్ గా రూపొందించేందుకు మరికొద్ది రోజుల్లోనే ట్రయల్స్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే. కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు జెన్నోవా కంపెనీ (IGC019' ఎంఆర్ఎస్ఏ (mRNA) ఆధారిత టీకాను రూపొందించిన విషయం తెలిసిందే. వీటిపై గతంలోనే తొలిదశ ప్రయోగాలు పూర్తి చేసి మధ్యంతర ప్రయోగ ఫలితాలను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDCSO)కు అందించింది. ఆ సమాచారాన్ని సబ్జెక్ట్ నిపుణుల కమిటీ విశ్లేషించి. . రోగనిరోధకతను ఇవ్వడంతో పాటు టీకా సురక్షితమైనదేనని నిర్ధారించింది. దీంతో రెండు, మూడో దశల ప్రయోగాలను కొనసాగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. కాగా రెండో దశ పరీక్షలు నిర్వహించిన సంస్థ.. ఈ వివరాలను శుక్రవారం డీసీజీఐకి పంపినట్లు సమాచారం. ఈ టీకాకు అనుమతి లభిస్తే.. దేశంలోనే మొట్టమొదటి ఎంఆర్ఎస్ఏ వ్యాక్సిన్ ఇదే కానుంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us