AP News: నా అనుచరుల అక్రమ మైనింగ్‌.. అదో దుష్ప్రచారం!

నగరి (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: చిత్తూరు జిల్లా నగరి వైకాపాలో వర్గపోరు తారస్థాయికి చేరింది. వైకాపాలో ఓ వర్గం కావాలనే తాను అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నానంటూ దుష్ప్రచారం చేస్తోందని నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. శుక్రవారం చిత్తూరు ఎస్పీని కలిసిన ఆమె.. తనపై ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తన అనుచరులతో అక్రమ మైనింగ్‌ చేయిస్తున్నట్టు కొందరు ఇటీవల డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారని, ఆయనతో తీసుకున్న ఫోటోలకు ఇతర వ్యాఖ్యలు జోడించి ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పేదల గృహనిర్మాణాన్ని నిలుపుదల చేసేందుకే కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. దొంగే ..దొంగ, దొంగ అన్నట్టుగా 1992 నుంచి నేరస్థుల జాబితాలో ఉన్నవారు తమను విమర్శించడం దారుణమని దుయ్యబట్టారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us