గుంటూరు (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.45లక్షల విలువైన నకిలీనోట్లు, రెండు కార్లు, కంప్యూటర్, ప్రింటర్లు, స్కానర్, పత్రాలు, సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితులంతా ఓ ముఠాగా ఏర్పడి నడికుడిలో కలర్ జిరాక్స్ ద్వారా రూ.200, రూ.500 నోట్లు ముద్రించి వివిధ ప్రాంతాల్లో చలామణి చేశారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో రూ.2.2లక్షల నకిలీనోట్లు చలామమణి చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులంతా రెంటచింతల, దుర్గి, దాచేపల్లి, అచ్చంపేట వాసులుగా గుర్తించామని ఎస్పీ తెలిపారు.







