Updated 18th June 2023 Sunday 1:20 pm
Dwarampudi criticized Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా తన గురించి మాట్లాతారని అనుకుంటున్నానని చెప్పారు. గొడవలు చూశానని, కొట్టుకోవడం చూశానని తెలిపారు.
కాకినాడలో కాంగ్రెస్ జెండాలు పాతి పాతి ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు. అన్నయ్య, తండ్రి పేరు చెప్పి తాను రాజకీయాలు లోకి రాలేదన్నారు. నా మీద లేని పోనీ ఆరోపణలు చేస్తే చూస్తూ ఉరుకోబోనని హెచ్చరించారు.
ఏ విషయంలో కూడా తగ్గేది లేదని తేల్చి చెప్పారు. బీసీలకు ఏమి చేశామనేది త్వరలో కాకినాడలో సభ పెట్టి చెబుతామని వెల్లడించారు.







