Pawan Kalyan: మరో యాత్రకు భీమ్లా నాయక్ రెడీ

UPDATED 10th FEBRUARY 2022 THURSDAY 07:00 AM

అమరావతి (రెడ్ బీ న్యూస్): జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరో యాత్రకు రెడీ అవుతున్నారు. నారసింహ సందర్శన పేరుతో యాత్ర చేపట్టనున్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కాంక్షిస్తూ నారసింహ సందర్శన చేపట్టనున్నట్టు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శంచుకున్నాక యాత్ర మొదలు పెడతానన్నారు. ఇక తనపై విమర్శలు చేస్తున్న పార్టీలకు కౌంటర్ ఇచ్చారు పవన్ కల్యాణ్‌. జనసేన సోషల్ మీడియా వింగ్ కు ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు.

దత్తపుత్రుడు అని పదే.. పదే విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలకు మాత్రమే తాను దత్తపుత్రుడినన్నారు. ఉద్యోగుల సమస్య విపక్షాలు సృష్టించింది కాదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ రద్దు చేస్తాం, జీతాలు పెంచుతామని వారిలో ఆశలు వైసీపీ కల్పించిందన్నారు పవన్. పీఆర్‌సీ అమలు చేయకపోవడంతో ఆగ్రహంతో ఉద్యోగులు నిరసన తెలిపితే .. జనసేనపై విమర్శలు చేయడం సరికాదన్నారు పవన్ కల్యాణ్‌. వీరి సమస్య విపక్షాలు సృష్టించింది. కాదని, అధికారంలోకి వచ్చాక వైసీపీ పలు హామీలు గుప్పించిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us