జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వేసవి వినోదం

UPDATED 7th JUNE 2017 WEDNESDAY 5:00 PM

పెద్దాపురం:  స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం వేసవి వినోదం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఇంద్రజాల ప్రదర్శన, శిక్షణతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకుడు బి. అనంతరావు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ తమ పుట్టినరోజు నాడు ఒక మొక్క నాటి దానిని సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని, అలాగే కూల్ డ్రింక్స్, మద్యం అతిగా సేవించడం వల్ల కలిగే అనర్ధాలను తెలియచేశారు. అనంతరం జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు డి.గంగాధరుడు మాట్లాడారు. అలాగే ప్రజా నాట్యమండలి కళాకారులు దారపురెడ్డి కృష్ణ, రొంగలి వీర్రాజు ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. ఇంద్రజాలికుడు బుద్ధా శ్రీనివాస్ సమాజంలో జరిగే మోసాలపై ప్రదర్శన ద్వారా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో బి. స్వర్ణ కుమార్, సూరిబాబు, యుటిఎఫ్ నాయకులు రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.   
 
   
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us