Alcohol Sales : ఇక నుంచి సూపర్ మార్కెట్లలోనే మద్యం కొనుగోలు

Updated 28 January 2022 Friday 07:20 AM

ముంబయి (రెడ్ బీ న్యూస్): ఇక నుంచి సూపర్ మార్కెట్లలోనూ వైన్ దొరుకుతుందని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త లిక్కర్ పాలసీలో భాగంగా వైన్ బాటిల్స్ ను పెద్ద కిరాణా షాపుల్లో, డిపార్ట్ మెంటల్ స్టోర్స్ లో విక్రయించేందుకు పర్మిషన్ ఇచ్చారు. గతంలో వీటిని కూడా కేవలం లిక్కర్ స్టోర్స్ లో మాత్రమే కొనుగోలు చేయాలి. ఎన్సీపీ మినిష్టర్ నవాబ్ మాలిక్ మాట్లాడుతూ.. చిన్న, మధ్య తరహా వైనరీస్ ను ఎంకరేజ్ చేసే దిశగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.‘పండ్ల ఆధారిత వైన్ ఉత్పత్తులకు ప్రేరణ పెరగాలనే ఉద్దేశ్యంతో పదేళ్ల పాటు జీఎస్టీని కూడా రద్దు చేశాం. దీని వల్ల రైతులకు లాభం కూడా పెరుగుతుంది. చిన్న, మధ్య స్థాయి వైన్స్ ను ప్రమోట్ చేసే దిశగా.. వెయ్యి చదరపు గజాలు అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్రదేశాల్లో స్టాల్ లేదా షోకేజ్ లా ఏర్పాటు చేసి విక్రయించుకోవచ్చు. కేబినెట్ మీటింగ్ లోనే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని నవాబ్ మాలిక్ స్పష్టం చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us