నవోదయలో ఘనంగా యువజనోత్సవాలు ప్రారంభం

UPDATED 26th SEPTEMBER 2017 TUESDAY 3:00 PM

పెద్దాపురం : రాష్ట్ర ప్రభుత్వం యువజనోత్సవాలు నిర్వహించడం ద్వారా యువతను ప్రోత్సహిస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. స్థానిక పెద్దాపురం-జగ్గంపేట రహదారిలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువజనోత్సవాలను ఆయన మంగళవారం ప్రారంభించారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువతీ యువకులు విద్యతో పాటు సాంస్కృతిక కళలలో రాణించడానికి యూత్ ఫెస్టివల్ పోటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. విద్యకే పరిమితంకాకుండా ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని యువత  రాణించాలన్నారు. అలాగే పెద్దాపురం పట్టణంలో క్రీడా స్టేడియంను త్వరలో నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సెట్రాజ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి.వి. రమణ మాట్లాడుతూ యువజన సంక్షేమ శాఖకు ప్రభుత్వం రూ. 100 కోట్లు బడ్జెట్ ను కేటాయించిందన్నారు. అలాగే త్వరలో యువతకు నిరుద్యోగ భృతిని అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇటీవల ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఐదుగురికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి  పది లక్షలు రూపాయలు ఖర్చు చేసి శిక్షణ ఇచ్చి పంపడం జరిగిందని, ఇది రాష్ట్రానికి ఎంతో పేరు తీసుకువచ్చిందన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను హోం మంత్రి ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, నవోదయ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి.మునిరామయ్య , శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల డైరెక్టర్ సి.హెచ్ విజయ్ ప్రకాష్, పెద్దాపురం, సామర్లకోట ఎంపిపిలు గుడాల రమేష్, గొడతా మార్త, న్యాయనిర్ణేతల అధ్యక్షుడు సుబ్బరాజు, గుమ్మళ్ళ రామకృష్ణ , పెద్దాపురం పట్టణ  టిడిపి అధ్యక్షుడు రంధి సత్యనారాయణ, సెట్రాజ్ కార్యనిర్వహణాధికారి స్వామి, తదితరులు పాల్గొన్నారు.      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us