UPDATED 29th NOVEMBER 2017 WEDNESDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఫుట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు సంస్థ వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 24 న కాకినాడ జె ఎన్ టి యూలో జరిగిన ఫుట్ బాల్ టీం ఎంపికలో తమ కళాశాలకు చెందిన ఆర్. హరికృష్ణ, ఆల్విన్ కె విన్సెంట్, వంలాల్ జెలం, జి. బేబీ, నితీష్ పౌడెల్, బ్లేస్సొన్ కె. అంబి లు జె ఎన్ టి యూ కె జట్టుకు ఎంపికయ్యారని, వీరు కేరళలోని కాలికట్ యూనివర్సిటీలో డిసెంబర్ 21 నుంచి 29 వరకు జరగబోయే ఫుట్ బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. తమ సంస్థ విద్యార్థులకు విద్యతో పాటు వారికి గల ఆసక్తిని బట్టి నిష్ణాతులైన ఫిజికల్ డైరెక్టర్ల పర్యవేక్షణలో వివిధ క్రీడలలో తర్ఫీదునిచ్చి వారిలో గల ప్రతిభాపాటవాలను వెలికితీసి ప్రోత్సహిస్తున్నామన్నారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, ఫిజికల్ డైరెక్టర్ సి.హెచ్. మురళీమోహన్, తదితరులు అభినందించారు.







