పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి

UPDATED 17th OCTOBER 2017 TUESDAY 11:45 AM

పెద్దాపురం: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులు చిరస్మరణీయులని రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక లూథరన్ హైస్కూల్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రజలకు సేవలందిస్తూ అమరులైన పోలీసు వీరులను స్మరించుకునేందుకు ఈ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహించుకొంటున్నామన్నారు. ప్రతీ సంవత్సరం అక్టోబర్ 21 వ తేదీన దేశవ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకొంటున్నామని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 15 నుంచి వారం రోజులు పాటు పోలీస్ శాఖ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ శిబిరంలో సుమారు 146  మంది రక్తదానం చేశారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా ఎ పి ఎన్ జి వో   అసోసియేషన్ నవంబర్ మూడున తలపెట్టిన "ఛలో తిరుపతి " గోడపత్రికను మంత్రి విడుదల చేశారు. అలాగే అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి తెప్పోత్సవ ఆహ్వాన పత్రికను దేవస్థానం ఇంచార్జి కార్యనిర్వహణాధికారి ఈరంకి జగన్నాధం మంత్రికి అందచేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ చిలకా వెంకట రామారావు, సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్, ఎస్ ఐ  కృష్ణ భగవాన్, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు శేషు కుమార్, రెడ్ క్రాస్, మన పెద్దాపురం ఫేస్ బుక్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us