UPDATED 26th NOVEMBER 2022 9:50 AM
Varisu : తమిళ్ స్టార్ విజయ్, వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా వారిసు. తమిళ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా వారసుడిగా తెలుగులో రిలీజ్ కాబోతోంది. ఎన్నో అంచనాలతో పాటు మంచి బజ్ ఉన్న ఈ సినిమా మొదటి నుంచి వివాదాలతోనే ట్రావెల్ అవుతోంది. వారసుడు వరస కష్టాల్లో పడ్డాడు. ఒక దాని తర్వాత ఒకటి విజయ్ సినిమాని రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నాయి కాంట్రవర్సీలు. సినిమా షూటింగ్ దగ్గరనుంచి రిలీజ్ వరకూ అడుగడుగునా ఏదో ఒక ఇష్యూ ఫేస్ చేస్తూనే ఉంది వారసుడు సినిమా. ఇప్పటికే సంక్రాంతి రిలీజ్ వివాదంలో ఉన్న వారసుడికి కొత్తగా మరో తలనొప్పి వచ్చింది.
ఇప్పటికే వారసుడు సినిమా సంక్రాంతి రిలీజ్ వివాదంలో ఉంది. వారసుడు తమిళ్ తో పాటు తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసుకుంది. కానీ స్ట్రెయిట్ తెలుగు సినిమాలున్నప్పుడు డబ్బింగ్ సినిమాలకు ఎక్కువ ధియేటర్లు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చేసింది ప్రొడ్యూసర్ కౌన్సిల్. దాంతో గ్రాండ్ గా రిలీజ్ అవుదామనుకన్న వారసుడు ఇబ్బందుల్లో పడ్డాడు. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ కూడా తోడవడంతో వారసుడికి మరిన్ని కష్టాలు వచ్చాయి. మరి ఈ కష్టాలన్నీ దాటి సంక్రాంతికి వారసుడు వస్తాడో లేదో చూడాలి.







