రైతు సమస్యల పరిష్కారానికే రైతు సేవలో రెవిన్యూ శాఖ

UPDATED 19th SEPTEMBER 2017 TUESDAY 8:00 PM

పెద్దాపురం: రైతు సమస్యల పరిష్కారానికే రైతు సేవలో రెవిన్యూ శాఖ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో ఆయన ఈ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ళ తరబడి అపరీష్కృతంగా ఉన్న సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా రైతులు పరిష్కరించుకోవచ్చన్నారు. ముఖ్యంగా అడంగల్ కాపీలు, సర్వే నంబర్ల మార్పులు, సర్వే నంబర్లు ఆన్ లైన్ మొదలైన సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. అనంతరం ఎం ఎల్ సి చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నేరుగా వారివద్దకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించేందుకు ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు మాట్లాడుతూ రైతు సేవలో రెవిన్యూ శాఖ కార్యక్రమం ద్వారా అక్కడికక్కడే సమస్యను పరిష్కరించడంతో పాటు రైతులకు సత్వర పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుడాల రమేష్, జెడ్పిటీసి సుందరపల్లి శివ నాగరాజు, మండల టిడిపి అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు( కోటి), తహసీల్దార్  గోగుల వరహాలయ్య , సర్పంచ్ తుమ్మల సూర్య కృష్ణమూర్తి, పిహెచ్సీ చైర్మన్ తుమ్మల వీరాస్వామినాయుడు, తదితరులు పాల్గొన్నారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us