UPDATED 10th OCTOBER 2022 MONDAY 10:20 AM
Amaravati Farmers : జిల్లాలోని పెనుగొండ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమరావతి రైతులకు అవమానం జరిగింది. పాదయాత్రకు ఈరోజు సెలవు కావడంతో రైతులు అమ్మవారి దర్శనానికి వెళ్ళారు. పూజలు చేస్తుండగా ‘‘మీకు రోజుకి 200 రూపాయలు ఇస్తున్నారంట కదా’’ అని రైతులను ఆలయ అర్చకుడు రామకృష్ణ ప్రశ్నించారు. అర్చకుని వైఖరితో రైతులు తీవ్ర మనస్తాపం చెందారు. ఈ వ్యవహారంపై ఆలయ కమిటీకి అమరావతి రైతులు ఫిర్యాదు చేశారు.







