తిరుమల (రెడ్ బీ న్యూస్) 13 జనవరి 2022: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేకటేశ్వర స్వామివారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి బంగారు రథం పై తిరువీధుల్లో విహరించారు. స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు స్వర్ణ రథాన్ని లాగారు.







