UPDATED 6th JULY 2018 FRIDAY 8:30 PM
గండేపల్లి: జాతీయ అభివృద్ధి సాధించడానికి రక్షణ విభాగంలో శిక్షణ ఎంతో అవసరమని కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్.సి.సి యూనిట్ 18(ఎ) 2018-21 బ్యాచ్ సెలెక్షన్స్ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎ.ఎన్.వో జె.డి. నాయుడు మాట్లాడుతూ విద్యార్థుల ఎంపిక శారీరక దృడత్వము, అకడమిక్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆధారంగా నిర్వహించారని, ఇందులో ఎంపికైన విద్యార్ధులకు మూడు సంవత్సరాలు ఆర్మీ, సామాజిక సేవలో శిక్షణ ఇచ్చి రెండు క్యాంపులు నిర్వహించిన అనంతరం బి, సి సర్టిఫికెట్లు అందచేస్తారని తెలియచేశారు.







