సత్యదేవుని హుండీ ఆదాయం రూ.2.82 కోట్లు

అన్నవరం (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: కార్తీకమాసంలో అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో రూ.2.82 కోట్లు సమకూరింది. రెండు దఫాలుగా లెక్కించారు. ఈ నెల 10న మొదటిసారి లెక్కింపులో రూ. 2.21 కోట్లు రాగా, రెండోసారి సోమవారం లెక్కించగా రూ.60.55 లక్షలు వచ్చింది. దీంతో మొత్తం రూ.2,81,95,545 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2020లో రూ.1.86 కోట్లు (కొవిడ్‌ ఆంక్షల కారణంగా ఆదాయం తగ్గింది), 2019లో రూ.2.36 కోట్లు వచ్చింది. 2019లో పోల్చితే ఈ ఏడాది ఆదాయం పెరిగింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us