అపోలో ఆసుపత్రి లో కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు

UPDATED 12th JUNE 2017 MONDAY 10:00 PM

కాకినాడ: జర్మన్ టెక్నాలజీతో తయారైన అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ అపోలో ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చింది. సుమారు 4.5 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన ఈ క్యాథ్ ల్యాబ్ వల్ల గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలను మరింత మెరుగైన పద్దతిలో చేసే అవకాశం కలుగుతుందని అపోలో ఆసుపత్రి కార్పొరేట్ రిలేషన్స్ మేనేజర్ జి.వి.ఆర్.మూర్తి తెలిపారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ యాంజియోగ్రామ్ , యాంజియోప్లాస్టీ చికిత్సా విధానాలను మరింత మెరుగైన పద్ధతిలో అందించే వెసులుబాటు ఉందని, ముఖ్యంగా స్టంట్ అమర్చే సమయంలో మరింత దగ్గరగా పరిశీలించే ఆధునిక సాఫ్ట్ వేర్ ఇందులో ఇమిడి ఉందన్నారు. కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ద్వారా చిన్న పిల్లలకు స్టంట్ వేయడంతో పాటు అతి తక్కువ రేడియేషన్ తో చికిత్స చేసే వెసులుబాటు కలుగుతుందని, అలాగే మెడ ద్వారా మెదడుకు వెళ్లే నరాలకు ఆధునిక పద్ధతుల్లో స్టంట్ అమర్చవచ్చన్నారు. రూ.3.5 కోట్లతో అత్యాధునిక 32 స్ట్రెస్ సిటి స్కాన్ అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. వీటితోపాటు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, ఎంప్లాయిస్ హెల్త్ స్కీం , జర్నలిస్ట్ హెల్త్ స్కీం, ఆరోగ్య రక్ష వంటి పథకాలు అపోలో ఆసుపత్రి లో అందుబాటులోకి వచ్చాయన్నారు. వీటిని రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం మధ్యాహ్నం ప్రారంభిస్తారని తెలిపారు.   

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us