26న నుంచి ఆదిత్య ఫుట్‌బాల్‌ లీగ్‌

UPDATED 12th JULY 2017 WEDNESDAY 8:00 PM

కాకినాడ : జిల్లా ఫుట్‌బాల్‌ అసోయేషన్‌, ఆదిత్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో జులై 26 నుంచి 30 వరకు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్, జిల్లా క్రీడా మైదానంలో ఆదిత్య ఫుట్‌బాల్‌ లీగ్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు విద్యాసంస్థల వైస్ చైర్మన్  నల్లమిల్లి సతీష్‌రెడ్డి  పేర్కొన్నారు. పోటీలకు సంబంధించిన లోగోను బుధవారం కాకినాడ ఎంపీ తోట నర్సింహం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఇంజినీరింగ్‌, మెడికల్‌, డిగ్రీ కళాశాలలకు చెందిన సుమారు 26 జట్లు పాల్గొంటున్నాయని, వీరికి లీగ్‌ కం నాకౌట్‌ పద్ధతిలో పోటీలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఫుట్‌బాల్‌ సంఘ కార్యదర్శి సుంకర నాగేంద్ర కిషోర్ , ఉపాధ్యక్షుడు టీవీఎస్‌ రంగారావు తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us