దేవుడి ముందు అందరూ సమానమే.. ఆలయాల్లో వీఐపీ సంస్కృతిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం!

UPDATED 29th MAY 2026 4:10 PM

చెన్నై, రెడ్ బీ న్యూస్, మే 29 : దేవాలయాల్లో కొనసాగుతున్న వీఐపీ సంస్కృతిపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయాల్లో కేవలం భగవంతుడు మాత్రమే వీఐపీ అని న్యాయస్థానం స్పష్టం చేసింది. భగవంతుడు ఎవరి కోసమూ వేచి ఉండడని పేర్కొన్న కోర్టు.. మంత్రులు, ఎమ్మెల్యేలు తాము అనుకున్న సమయంలో ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. దేవుడి సన్నిధిలో భక్తులందరూ సమానమేనని స్పష్టం చేసింది.

​ఆలయాల్లో స్పెషల్ మరియు పెయిడ్ (రుసుముతో కూడిన) దర్శనాలను రద్దు చేయాలని దాఖలైన ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు మినహా మరెవరికీ ఆలయాల్లో ప్రత్యేక మర్యాదలు అవసరం లేదని పిటిషనర్లు తమ వ్యాజ్యంలో పేర్కొన్నారు.

​రాజ్యాంగ విరుద్ధం.. సమానత్వ హక్కుకు భంగం!

​ఈ విచారణ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక అంశాలను ప్రస్తావించింది:

  • ​సామాన్యులకు అన్యాయం: వీఐపీల కోసం సామాన్య భక్తులను గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది.
  • ​ప్రత్యేకం కాదు: మంత్రులు, ప్రజాప్రతినిధులు తామేదో ప్రత్యేకమైన వారం అని భావించవద్దని స్పష్టం చేసింది.
  • ​ఆర్టికల్ 14 ఉల్లంఘన: ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ ప్రత్యేక దర్శనాలు కల్పించడం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం లభించిన 'సమానత్వ హక్కును' ఉల్లంఘించడమేనని న్యాయస్థానం తేల్చి చెప్పింది.

​తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు

​ఆలయాల్లో వీఐపీ సంస్కృతి, పెయిడ్ దర్శనాల రద్దుపై వివరణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పూర్తి వివరాలతో సమాధానం చెప్పాలని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను న్యాయస్థానం 6 వారాల పాటు వాయిదా వేసింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us