UPDATED 27th MAY 2017 SATURDAY 5:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో భారత ప్రధమ ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల క్యాంపస్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనం గా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నవభారత నిర్మాతగా పేరు గాంచిన ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం అని పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్.రమాశ్రీ, గ్రంధాలయాధికారి కె. అశోక్ కుమార్, వివిధ శాఖాధిపతులు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.







