Updated 20th December 2022 Tuesday 8:45 am
woman gang-raped : కృష్ణా జిల్లాలో కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. పెనమలూరులో మహిళపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. మహిళకు మద్యం తాగించి సామూహిక అత్యాచారం చేశారు. సదరు మహిళను విజయవాడ నుంచి పెనమలూరుకు తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బాధితురాలు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. మరొక నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.







