పేదరిక నిర్మూలనకు రూ. 50 వేల కోట్లు

Updated 12th April 2017 Wednesday 8:30PM

పెద్దాపురం: రాష్ట్రం లో పేదరిక నిర్మూలనకు బడ్జెట్ లో రూ. 50  వేల కోట్లు కేటాయించడం జరిగిందని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి యనమల  రామకృష్ణుడు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో నూతనంగా రూ.1 .24 కోట్లు తో నిర్మించిన ఆర్ టి సి బస్సు కాంప్లెక్స్ ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ 2017 -18 వార్షిక బడ్జెట్ రూ. 1.50  వేల కోట్ల రూపాయలతో రూపొందించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యసాధన కోసం ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే  కొత్త బస్సులు కొనుగోలుకు రూ. 350  కోట్లు ఆర్ టి సి కి చెల్లించడం జరిగిందన్నారు. రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధిపధంలో నడిపించేందుకు ప్రజలందరూ  సహకరించాలన్నారు. నియోజకవర్గంలో రెసిడెన్సియల్ పాఠశాలను త్వరలో మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. పట్టణంలో అన్ని ముఖ్య కార్యాలయాలు ఒకే  ప్రాంతంలో ఉండేలా రూపొందించడం జరుగుతుందన్నారు. జలవనరుల శాఖామంత్రి దేవినేని  ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం జరుగు తుందన్నారు. ప్రతీ ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖామంత్రి కే. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రజలందరినీ అన్ని విధాలా ఆదుకునేందుకు కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు. బలహీనవర్గ ప్రజలకు సబ్ ప్లాన్ నిధుల క్రింద రూ. 12  వేల కోట్లు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. పౌర సరఫరాల శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రైతులు నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 48  గంటల్లో గిట్టుబాటు ధర ను వారి ఖాతా లో జమచేయడం జరుగుతుందన్నారు. రైతులను డ్వాక్రా మహిళలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. శాసన మండలి ఉపాధ్యక్షడు  రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పధం లో నడుస్తోందన్నారు. . అనంతరం పలు అభివృద్ధి  కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్య క్రమంలో ఆర్ టి సి మేనేజింగ్ డైరెక్టర్ పూనం మాల కొండయ్య, జిల్లా కలక్టర్  హెచ్. అరుణ్ కుమార్, జాయింట్ కలక్టర్ ఎస్. సత్యనారాయణ, జిల్లా పరిషత్  ఛైర్మన్ నామన రాంబాబు, శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కరరామారావు, చిక్కాల రామచంద్రరావు, శాసన సభ్యులు వర్మ, దాట్ల బుచ్చిరాజు, నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి , వేగుళ్ల జోగేశ్వరరావు, పెందుర్తి వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యాల వీరభద్ర రావు( రాజబ్బాయి) కౌన్సిలర్లు,టిడిపి నాయకులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us