Heavy Rains : ఏపీలో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం..విపత్తుల సంస్థ అలర్ట్

UPDATED 9th JULY 2022 SATURDAY 03:50 PM

Heavy rains : ఏపీలో వర్షాకాలం భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ఏపీ విపత్తుల సంస్థ ముందస్తు అప్రమత్తం అయింది. ఈ రోజు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విపత్తుల సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు.

జిల్లాల్లో కూడా అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచించించారు. మీ ప్రాంతంలో భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉంటే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు కింద పేర్కొన్నారు.

• 1070

• 18004250101

• 08632377118

మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో కోస్తా ఆంధ్రలో ముసురు వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతోపాటు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us