ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : ప్రీమియం ఎస్ యూవీ అయిన సఫారీలో డార్క్ ఎడిషన్ ను టాటా మోటార్స్ సోమవారం విడుదల చేసింది. దీని ధర రూ.19.05 లక్షలు (ఎక్స్ షోరూం). బుకింగ్స్ ప్రారంభమైనట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే దేశవ్యాప్తంగా అన్ని డీలర్లలో ఈ వాహనం అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. ఎక్స్ టీ+, ఎ టీఏ+, ఎక్స్ జెడ్+, ఎక్స్ జె ఏ+ ట్రిమ్ లో డార్క్ ఎడిషన్ సఫారీ అందుబాటులో ఉంది. దీంట్లో ప్రత్యేకంగా రెండు వరుసల్లోని సీట్లకు వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. ఎయిర్ ప్యూరిఫయర్లు, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే కూడా డార్క్ ఎడిషను ప్రత్యేకం. డార్క్ ఎడిషను ఆదరణ పెరుగుతోందని టాటా మోటార్స్ ప్యాసెంజర్ వెహికల్స్ ఉపాధ్యక్షుడు రాజన్ అంబా తెలిపారు. తొలుత పరిమిత ఎడిషన్ కింద తీసుకొచ్చిన ఈ మోడళ్లు తర్వాత తమ ప్రధాన వాహన శ్రేణిలో జత చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. హ్యారియర్ డార్క్ అలా తీసుకొచ్చిందేనని తెలిపారు. కానీ, తర్వాత కస్టమర్ల డిమాండ్ మేరకు హ్యారియర్ పోర్ట్ ఫోలియోలో డార్క్ ఎడిషనను చేర్చాలి వచ్చిందన్నారు. ఇప్పటి వరకు 16,000 సఫారీ ఎస్ యూవీలను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది.







