UPDATED 15th DECEMBER 2017 FRIDAY 6:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ నెల 13,14 తేదీల్లో అవంతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయస్థాయి టెక్నికల్ ఫెస్టివల్ "యుక్తి 2 కె 17"లో ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బిటెక్ రెండవ సంవత్సరం ఈ.ఈ.ఈ. బ్రాంచ్ విద్యార్థులు ఎం. విజయ్ కుమార్, ఎం వీరేంద్ర అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి, నగదు పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, విభాగాధిపతి మనోజ్ కుమార్ రెడ్డి, అధ్యాపకులు, తదితరులు అభినందించారు.







