UPDATED 25th JANUARY 2018 THURSDAY 5:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ విద్యార్థులకు హెపటైటిస్-బి వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమం నిర్వహించినట్లు ఆదిత్య బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెపటైటిస్-బి వ్యాధి తీవ్రమైన లివర్, కాలేయంకు సంబంధించిన వ్యాధి వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుందని, ఈ వ్యాధి సోకిన వారికి అలసట, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, వాంతులు, విరోచనాలు, కడుపులో నొప్పి, శరీరమంతా దురద, కామెర్లు, చర్మం, కళ్ళు పసుపురంగులో మారడం జరుగుతుందన్నారు. ప్రతీ పన్నెండు మందిలో ఒకరికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని, దీనిని హెపటైటిస్-బి టీకా వాక్సిన్ నిరోదిస్తుందన్నారు. కాకినాడకు చెందిన ప్రముఖ వైద్యులు ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో మూడు పర్యాయాలు ఈ వాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని, రూ.750 /- విలువ గల ఈ వాక్సిన్ తమ సంస్థ విద్యార్థులకు కేవలం రూ.75 /- కు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు వాక్సిన్ వేసుకున్నారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి తెలిపారు.







