ఆదిత్య లో ముగిసిన ఫాకల్టీ శిక్షణా తరగతులు

UPDATED 30th JUNE 2017 FRIDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో గత పది రోజులుగా నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ శిక్షణా తరగతులు ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి హాజరైన కళాశాల వైస్ ఛైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హయ్యర్ ఎడ్యుకేషన్, బ్రిటీష్ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ శిక్షణా తరగతులు విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫ్యాకల్టీ శిక్షణా తరగతుల ద్వారా అధ్యాపకులు తమ నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుచుకోవడమే కాకుండా విద్యార్థులకు మరింత చక్కని బోధన చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అలాగే అధ్యాపకులకు ఆంగ్ల భాషపై మరింతగా పరిజ్ఞానం పెంపొందుతుందన్నారు. ఈ ఫ్యాకల్టీ తరగతిలో శిక్షణ పొందిన 16   మంది అధ్యాపకులను, శిక్షణ ఇచ్చిన ప్రొఫెసర్ రెబెక్కాను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాస రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్స్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాదేవి, అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us