Jallikattu: జల్లికట్టులో అపశృతి.. బావిలో పడ్డ ఎద్దు

Updated 30 January 2022 Sunday 06:45 PM

చిత్తూరు (రెడ్ బీ న్యూస్): జిల్లాలో జల్లికట్టు వేడుకలు జోరుగా కొనసాగుతున్నాయి. అంగరంగ వైభవంగా జల్లికట్టు ఎద్దులను ముస్తాబు చేశారు. వెదురుకుప్పం మండలం చిన్నపోటులో జల్లికట్టు వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. వేడుకల్లో పరిగెడుతూ ఎద్దు అదుపుతప్పింది. దీంతో ఎద్దు బావిలో పడి మృతి చెందింది. ఎద్దులను నివారించేందుకు యువత ఎగబడ్డారు. కోడె గిత్తలను నిలువరించి, వాటి కొమ్ములకు కట్టిన బహుమతులను చేజిక్కించేందుకు యువకులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో కొందరు గాయపడ్డారు. జల్లికట్టు చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us