UPDATED 27th JULY 2017 THURSDAY 5:30 PM
గండేపల్లి: ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఓటు హక్కు పై నిర్వహించిన అవగాహనా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరూ ఓటుహక్కు కలిగి ఉండడం ప్రథమ కర్తవ్యమని, ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని, ఓటు హక్కు పొందనివారు. ఆయా ప్రాంతాల్లో గల బూత్ లెవెల్ అధికారులను సంప్రదించాలని లేదా ఆన్ లైన్ ద్వారా ఓటర్ గా నమోదుకావచ్చని సూచించారు. అనంతరం కళాశాల చైర్మన్ నల్లమిల్లి శేషా రెడ్డి మాట్లాడుతూ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో అధిక శాతం విద్యావంతులు ప్రతిభాపాఠవాలు యువశక్తి నిండిన మనదేశంలో ప్రజాస్వామ్యానికి వెన్నుముకైన ఎన్నికల విధానంలో యువత ఉత్సాహంగా పాల్గొనాలని, విజ్ఞతతో వ్యవహరించి సమర్ధవంతమైన నాయకున్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ ఎన్. సతీష్ రెడ్డి, బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణా రెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ఆదిరెడ్డి రమేష్, కాకినాడ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బి.ఈ.వి.ఎల్. నాయుడు, ఈఆర్వో ఇ.ఎస్. భీష్మనంద, తహసీల్దార్ గీతాంజలి, ఎంపిడివో కె. రమేష్, ఏపీవో భ్రమరాంబ, హౌసింగ్ ఏఈ వెంకటేశ్వరావు, రెవిన్యూ ఇనస్పెక్టర్ సుజాత, వి ఆర్ ఓ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.







