AP News: ఏపీలో ఆర్టీసీ సమ్మె.. నిలిచిపోనున్న బస్సులు!

UPDATED 22 JANUARY 2022 SATURDAY 02:00 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్) : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మై సైరన్ మ్రోగించారు. వీరు చేపట్టే సమ్మె ఆర్టీసీపై ప్రభావం చూపింది. ఫిబ్రవరి 07వ తేదీ నుంచి జరుగనున్న సమ్మెకు ఆర్టీసీ యూనియన్ల సంఘాలు మద్దతు తెలపడం గమనార్హం. పీఆర్సీ సాధన సమితికి ఆర్టీసీ ఉద్యోగులు మద్దతు తెలిపారు. దీంతో ఫిబ్రవరి 07వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెలోకి వెళ్లనున్నారు. పెద్ద సంఘాలు మద్దతు తెలపడంతో…ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. 2022, జనవరి 22వ తేదీ ఆదివారం రాష్ట్ర సీఎస్ ను ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు కలిసి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులతో 10tv మాట్లాడింది. మా జీతాలు తగ్గించుకోవాలంటే..కుదరదని, ఆర్టీసీ ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నా గతంలో ప్రతి నెలా ఒకటి తేదీనే వేతానాలు వచ్చేవన్నారు. ప్రస్తుతం రెండు నుంచి ఏడు…తొమ్మిదో తేదీ వరకు జీతాలు పడుతున్నాయని తెలిపారు. అయినా..ఆ విషయం..ఇక్కడ ఉత్పన్నం కాదన్నారు. 8 శాతం హెచ్ఆర్ఏ లో పెట్టిన తర్వాత…జీతాలు తగ్గవని ప్రభుత్వం ఎలా చెబుతుందో అర్థం కావడం లేదన్నారు. ఇంటి అద్దెలో..నాలుగు వేల రూపాయలు తాను కోల్పోవడం జరుగుతోందన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us