UPDATED 17th JUNE 2017 SATURDAY 6:00 PM
గండేపల్లి: విజేతలు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోరు, వాళ్ళ విజయాలే వాళ్ళ గురించి చెబుతాయని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, సెక్రటరీ కృష్ణ దీపక్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఫాదర్స్ డే సందర్భంగా వారి తండ్రి ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డికి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ నవమాసాలు మోసి కని పెంచింది అమ్మే అయినా, తమను వేలు పట్టి నడిపించి ప్రపంచానికి పరిచయం చేసింది తన తండ్రి శేషారెడ్డి అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. స్వయంకృషితో తనను తాను ఒక అద్భుత శిల్పంగా మలుచుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించి తన తనయులమైన తమను ఉన్నత శిఖరాలు అధిరోహించేలా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి తన తండ్రే అని గర్వంగా చెప్పారు. ఆయన జీవితం నేటి యువతకు ఎంతో ఆదర్శమని నిరుద్యోగ యువతకు కల్పతరువుగా ఎన్నో కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నమహోన్నత వ్యక్తి తమ తండ్రి శేషారెడ్డి అని అన్నారు. ఎందరో విద్యార్థులకు విద్యాదాతగా దేశం గర్వించేటటువంటి ఇంజినీర్లను తీర్చిదిద్దుతున్న గొప్ప వ్యక్తి అన్నారు. ఎన్ని జన్మలెత్తినా తమ తండ్రి రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనను పూలమాలలతో, దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







