UPDATED 21st FEBRUARY 2022 MONDAY 09:20 AM
AP Minister Goutham Reddy Died : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హాఠాన్మరణం చెందారు. 2022, ఫిబ్రవరి 21వ తేదీ సోమవారం ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను కుటుంబసభ్యులు హైదరాబాద్ కు తరలించారు. అపోలో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గౌతమ్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పల్స్ దొరకడం కష్టంగా ఉందని సమాచారం. చికిత్సకు శరీరం సహకారం అందించలేదు. దీంతో ఆయన కన్నముూశారు. ఆయన మృతి చెందారనే వార్త తెలుసుకున్న వైసీపీ నేతల తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు.
గౌతమ్ రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి. వైసీపీ ఆరంభం నుంచే మేకపాటి కుటుంబం వైఎస్ జగన్ తోనే ఉంది. ఇటీవలే ఆయనకు రెండుసార్లు కరోనా సోకింది. అనంతరం ఆయన వైరస్ నుంచి కోలుకున్నారు. ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 2014 రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూర నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. రెండుసార్లు ఈయన ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు.







