సమస్యలు పరిష్కరించాలని తహసీల్దారుకు వినతి

UPDATED 4th JUNE 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక బలుసుపేట,14వ వార్డుల్లో బహిరంగ మలవిసర్జన కొనసాగుతున్నందున ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తక్షణం చర్యలు తీసుకోవాలని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నేతల హరిబాబు ఆధ్వర్యంలో ప్రజలు తహసీల్దార్ ఎల్.శివకుమార్ కు సోమవారం వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ డ్రైనులు, పైపులైన్లు నిమిత్తం రోడ్లు తవ్వి పూడ్చకుండా వదిలేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, తోట గోపాలకృష్ణ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్, తెలుగు ఉపాధ్యాయులను నియమించాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మేము ఇచ్చే ఫిర్యాదులు కాగితాలకే పరిమితం అవుతున్నాయని అన్నారు. పాఠశాల ప్రహారీగోడ నిర్మాణానికి నిధులు మంజూరై సంవత్సరం గడిచినా సరే ఇంతవరకూ పనులు ప్రారంభించలేదని, హౌసింగ్ పథకంలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. 14వ వార్డులోని కమ్యూనిటీ భవనం ఉపయోగంలోకి తీసుకువస్తే చిన్న చిన్న కార్యక్రమాలు అనుకూలంగా ఉంటుందన్నారు. జన్మభూమి కార్యక్రమంలో రేషన్ కార్డులు కోసం దరఖాస్తు చేసినా ఇంతవరకూ రాలేదని, ఇళ్ళ మధ్యలో ఉన్న కరెంటు స్తంభాలను తొలగించాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన తహసీల్దారుకు వివరించారు. ఈ కార్యక్రమంలో నొక్కు సూరిబాబు, బుంగా అప్పలకొండ, వల్లపు రమణ, తెలుగు గంగ, కుంచే జగ్గారావు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us