Vijay Devarakonda: ఆర్గాన్స్ డొనేట్ చేసిన విజయ్ దేవరకొండ.. శభాష్ అంటోన్న అభిమానులు!

UPDATED 16th NOVEMBER 2022 WEDNESDAY 6:30 PM

Vijay Devarakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ ఫెయిల్యూర్ నుండి ఇప్పుడిప్పుడే బయటపడి, తన నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్‌లో ‘ఖుషి’ అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుండగా, ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. కాగా, తాజాగా విజయ్ దేవరకొండ ఓ ప్రకటన చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు.

హైదరాబాద్‌లోని పేస్ ఆస్పత్రి నిర్వహించిన లీవర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవగాహన సదస్సుకు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ క్రమంలో పేస్ ఆసుపత్రితో తనకున్న రిలేషన్ గురించి ఆయన చెప్పుకొచ్చాడు. ఒక సందర్భంలో తాను సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పుడు తన తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని, ఆ సమయంలో పేస్ ఆసుపత్రి వారు ఆయనకు సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ఆయన్ను కాపాడారని.. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారంటే అది పేస్ ఆసుపత్రి వల్లే అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. ఇక తన అవయవాలను దానం చేస్తున్నట్లు ఈ సందర్భంగా విజయ్ తెలిపాడు.

తన అవయవాలు వేరొకరి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయంటే, తనకంటే సంతోషించేవారు ఉండరని విజయ్ తెలిపాడు. ఇలా విజయ్ తన ఆర్గన్స్ డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించడంతో నెట్టింట ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విజయ్ రాబోయే రోజుల్లోనూ ఇలాంటి మంచి పనులు చేయాలని అభిమానులు కోరుతున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us