అర్హులందరికీ ఆర్ & ఆర్ ప్యాకేజీ

రంపచోడవరం,23 మే 2020 (రెడ్ బీ న్యూస్): పోలవరం ముంపునకు గురైన అర్హులైన వారందరికి ఆర్ & ఆర్ ప్యాకేజీ పూర్తిస్థాయిలో మంజూరు చేయాలని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ పోలవరం ప్రోజెక్టు ఆర్ & ఆర్ ప్యాకేజీ ప్రత్యేక అధికారి ఓ.ఆనంద్, రంపచోడవరం సబ్ కలెక్టర్, ఇన్ చార్జ్ ఐటీడీఏ ప్రోజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్యతో సుమారు 150 మంది ధరఖాస్తులపై వివరించారు. పోలవరానికి సంబంధించిన ముంపు బాధితులైన గిరిజనేతరులకు సకల సదుపాయాలతో కాలనీలు త్వరితగతిన పూర్తిచేసి బాధితులకు అందచేయాలని ఎమ్మెల్యే ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ ఉదయభాస్కర్ అన్నారు. అందుకు ప్రోజెక్టు స్పెషల్ ఆఫీసరు స్పందించి పోలవరం ప్రోజెక్టు ముంపునకు గురై అర్హులైన వారందరికీ వారి ఆధారాలను పరిశీలించి ఆర్ & ఆర్ ప్యాకేజీ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. త్వరలో కాలనీలు పూర్తిచేసి ముంపునకు గురైన వారందరినీ ఈ కాలనీలకు తరలించడం జరుగుతుందన్నారు. కరోనా కారణంగా నిర్మాణాలు నిలిచిపోయాయని మళ్లీ నిర్మాణాలు ప్రారంభిస్తామని అన్నారు. పోలవరం నీటి పారుదల ప్రోజెక్టు నిర్మాణాన్ని త్వరలో పూర్తిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. చాలా మంది పూర్తిస్థాయిలో ప్యాకేజీ రాలేదని ఇవన్నీ పరిశీలించి ముంపునకు గురైన వారందరికి ఆర్ ఆర్ ప్యాకేజీ సకాలంలో మంజూరు చేయాలని రంపచోడవరం నియోజకవర్గం పర్సజపతినిధులు కోరారు. అదేవిధంగా ప్రోజెక్టు నిర్మాణాలు ఆర్ & ఆర్ కాలనీలు, ఆర్ & ఆర్ ప్యాకేజీకి సంబంధించిన విషయాలు ప్రోజెక్టు ప్రత్యేక అధికారి, రంపచోడవరం ఐటీడీఏ ప్రోజెక్టు అధికారితో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్ & ఆర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us