ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకుంటాం

* రాష్ట్రంలో గ్రామాలకు లింకురోడ్డు నిర్మాణం
* పెద్దాపురం నియోజకవర్గానికి లింకురోడ్డు నిర్మాణానికి రూ.10 కోట్లు
* ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప
UPDATED 30th MAY 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: ఉద్దానం కిడ్నీ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి  నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని పి.వేమవరం గ్రామంలో నాబార్డు నిధులు రూ. కోటి 10 లక్షలు అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సామర్లకోట నుంచి పి.వేమవరం వరకు లింకు రోడ్డు పనులకు మంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ఉద్దానం ప్రజల సమస్య 100 సంవత్సరాలు నుంచి ఉందని, ప్రజల సమస్యలను పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అంచెలంచెలుగా చర్యలు చేపట్టిందని చెప్పారు. గ్రామంలో త్రాగునీరు వల్ల వచ్చే కిడ్నీ సమస్యలను అధిగమించడానికి అన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పారు. టెక్నికల్ ల్యాబ్ ను ఏర్పాటు చేసి డయాలసిస్ నిర్వహిస్తుందని, దీనికి ఒక్కొక్క వ్యక్తికి రూ.2500/-లు ఖర్చు చేస్తున్నామని, ఈ విధానం దేశంలో ఎక్కడా కూడా లేదని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్నందున ఎక్కువ నిధులు కేటాయించి ఉద్దానం ప్రజలను ఆదుకుంటారని తెలిపారు. రాష్ట్రమంతటా గ్రామ గ్రామానికి లింకురోడ్లు ఏర్పాటుకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని, ఇందులో భాగంగా పెద్దాపురం నియోజకవర్గానికి రు.10 కోట్లు నిధులు మంజూరయ్యాయని, ఈ నిధులతో నియోజకవర్గంలోని 10 గ్రామాలకు లింకురోడ్డు సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే మొదటిగా సామర్లకోట రోడ్డు నుంచి పి.వేమవరం వరకు రూ. కోటి 30 లక్షలతో రహదారి పనులను ప్రారంభించామని తెలిపారు. పి.వేమవరంలో ఉన్న ఈ రోడ్డు గత 30 సంవత్సరాలు నుంచి సమస్యగా ఉందని, ఈ రోడ్డు నిర్మాణంతో ఈ సమస్య తీరుతుందని, గ్రామాలకు లింకురోడ్లు ఏర్పాటు ద్వారా ప్రజలకు ప్రయాణం మెరుగవుతుందని అన్నారు. గ్రామంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, ఎస్.సి కాలనీలో సి.సి.రోడ్లు, డ్రైన్లు కూడ ఏర్పాటు చేశామని, పరిపాలనా సౌలభ్యం కోసం పంచాయతీ, అంగన్వాడీ, కమ్యూనిటీ భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అందచేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుమ్మళ్ళ విజయలక్ష్మి, ఇంచార్జ్ ఎంపిపి ఎ. సత్తిబాబు, సర్పంచ్ నూతలపాటి మాణిక్యం, ఎంపిటిసి సూర్యచక్రం, ఎఎంసి వైస్ చైర్మన్ చిట్టిబాబు, గుమ్మళ్ళ రామకృష్ణ, శ్రీపతి అప్పారావు, శ్రీనుబాబు, ఎంపిడివో కె. స్వప్న, ఇవోపిఆర్డీ జగ్గారావు, డిఇఇ ఎం. రామోహనరావు, ఎఇ ఎం. మురళి, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us